![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -44 లో.....నర్సింహా అక్కడ జరిగిన అవమానానికి వచ్చి డ్రింక్ చేస్తుంటాడు. అక్కడ జరిగిందే గుర్తుకు చేసుకుంటాడు... ఇక అక్కడే ఉన్న అనసూయ నేను వెళ్ళకని చెప్పాక కూడా ఎందుకు వెళ్ళావని అంటుంది.. దాని బ్రతుకేదో అది బతుకుంది.మ ఆ పెద్దావిడ ప్రాణాలు కాపాడింది.. అందరూ దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు.. దాని జోలికి పోతే పెద్దవాళ్ళతో వ్యవహారం పోలీస్ కేసు అంటారని అనసూయ అంటుంది.
ఇంత అవమానం జరిగింది దాన్ని ఎలా వదిలి పెడతానని నర్సింహా అంటాడు. నువు అయినా చెప్పు కోడలు పిల్ల దాని జోలికి పోకు శోభతో అనసూయ అనగానే.. శోభ కోపంగా.. చెప్తాను తాగింది దిగినాక.. ఇప్పుడు ఆలోచించుకోనివ్వండి అని శోభ కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నర్సింహా అన్న మాటలు కార్తిక్ గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే కార్తీక్ తండ్రి శ్రీధర్ వచ్చి.. కార్తీక్ తో కోపంగా మాట్లాడతాడు. అక్కడ జరిగింది మొత్తం జ్యోత్స్న నాకు ఫోన్ చేసి చెప్పిందని శ్రీధర్ అంటాడు. నా కోడలు ఏడవడం ఎప్పుడు చూడలేదని కాంచన అంటుంది. ఇక లేట్ చెయ్యొద్దు వెంటనే కార్తీక్ , జ్యోత్స్న ల పెళ్లి చెయ్యాలని శ్రీధర్ అంటాడు.. నాకు కొంచెం టైమ్ కావాలి. ఇప్పుడే ఈ విషయం డిస్కషన్ చెయ్యకండి అని కార్తీక్ అంటాడు.ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరకి పారిజాతం వచ్చి.. ఇదే మంచి సమయం కార్తీక్ ని నీ సొంతం చేసుకోవడానికి అని అంటుంది. మీ అమ్మతో వెళ్లి మాట్లాడు.. కార్తీక్ కి నీకు పెళ్లి చేసేలా... ఆ దీప కంటే నువ్వే ముఖ్యమనేలా మాట్లాడమని జ్యోత్స్నకి పాతిజాతం చెప్తుంది.
ఆ తర్వాత త్వరలోనే నిన్ను స్కూల్ లో జాయిన్ చేస్తాను.. నేను ఒక దగ్గర పనిలో జాయిన్ అయ్యాను.. నువ్వు ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళకని శౌర్యకి దీప చెప్తుంది. మరుసటిరోజు ఉదయం దీప హోటల్ కి వెళ్లి.. కడియంతో కలిసి అన్ని రకాల టిఫిన్ లు రెడీ చేస్తుంది. ఏది తీసుకున్న ఉప్మా ఫ్రీ అని బోర్డు పెడుతుంది. అందరూ టిఫిన్ బాగుందని చెప్తారు. కార్తీక్ వచ్చి ఉప్మా తిని బాగుంది. రేపు కూడా ఇక్కడే తింటానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |